: ప్రముఖ రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గాకు 2015 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆమె రాసిన 'విముక్త' కథా సంపుటికి ఈ పురస్కారం దక్కింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న ఈ అవార్డును ఓల్గాకు ప్రదానం చేయనున్నారు. దేశంలోని అన్ని భాషల నుంచి వచ్చిన నవలలు పోటీపడగా ఓల్గా సంపుటికే అవార్డు దక్కడం విశేషం. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారిపట్ల నెలకొన్న పరిస్థితులపై విముక్తలో ఆమె పేర్కొన్నారు.