: తెరకెక్కుతున్న సైనా నెహ్వాల్ జీవిత చరిత్ర


బాలీవుడ్ లో క్రీడాకారుల ఆటోబయోగ్రఫీల హవా నడుస్తోంది. 'భాగ్ మిల్ఖా భాగ్' సూపర్ హిట్ తరువాత వచ్చిన 'మేరీ కోం' కూడా ఆకట్టుకోవడంతో బాలీవుడ్ దర్శకులంతా ఆటోబయోగ్రఫీల బాటపట్టారు. అమీర్ ఖాన్ మల్ల యోధుడు మహవీర్ ఫోగట్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న 'దంగల్' లో నటిస్తుండగా, సల్మాన్ ఖాన్ కూడా 'సుల్తాన్' సినిమాలో బాక్సర్ గా కనువిందు చేయనున్నాడు. సానియా మీర్జా జీవిత చరిత్ర తీసేందుకు సన్నాహాలు మొదలు కాగా, తాజాగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. దీనికి అమోల్ గుప్తా దర్శకత్వం వహించనున్నారని, తనను సంప్రదించారని, తన జీవిత చరిత్ర సినిమాగా రూపుదిద్దుకోవడం పట్ల ఆసక్తిగా ఉన్నానని సైనా నెహ్వాల్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

  • Loading...

More Telugu News