: అభిమానుల తీరు బాధ కలిగించింది: హృతిక్ రోషన్


అభిమానుల అత్యుత్సాహం ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కు తీవ్ర మనోవేదన కలిగించింది. హృతిక్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న 'మొహంజొదారో' సినిమా షూటింగ్ జబల్ పూర్ లో జరుగుతోంది. హృతిక్ షూటింగులో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న అభిమానులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. అక్కడితో ఆగని అభిమానులు, షూటింగ్ స్పాట్ నుంచి హృతిక్ హోటల్ కు వెళ్తుండగా ద్విచక్రవాహనాలపై అతనిని వెంబడించారు. ఈ క్రమంలో అభిమానులు కొందరు గాయపడ్డారు. దీనిపై హృతిక్ రోషన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అభిమానులు గాయపడడం కలచివేస్తోందని తెలిపాడు. అభిమానులు తన దగ్గరకు వచ్చి కలవకపోయినా వారి అభిమానాన్ని తాను ఆస్వాదించగలనని హృతిక్ చెప్పాడు. తనపై అభిమానులు చూపించే ప్రేమ, ఇతరులకు హాని కలిగించడం బాధిస్తోందని అన్నాడు.

  • Loading...

More Telugu News