: డీడీసీఏ అవినీతిని కప్పిపుచ్చే లక్ష్యంగానే కేజ్రీ ఆఫీసులో సోదాలు: ఆప్


ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) స్కాంను బయటకు రానివ్వకుండా చేయాలన్న ఆలోచనతోనే సీఎం అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సీబీఐ సోదాలు చేయించారని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. ఆయన డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆ పార్టీ నేత కుమార్ విశ్వాస్ ఆరోపించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జైట్లీ హయాంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, ఢిల్లీ స్టేడియం పునర్నిర్మాణం కోసం జైట్లీ నిధులను అక్రమంగా నకిలీ కంపెనీలకు తరలించారని చెప్పారు. స్టేడియంను రూ.24 కోట్ల వ్యయంతో పునర్నిర్మించాలని సంకల్పించారని, కానీ మొత్తంగా రూ.114 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఈ క్రమంలో స్డేడియంను పునర్నిర్మించిన ఓ కంపెనీకి రూ.57 కోట్లు చెల్లించారని, మరి మిగతా రూ.57 కోట్లు ఎక్కడికెళ్లాయని మరో ఆప్ నేత చద్దా ప్రశ్నించారు. అయితే మిగతా డబ్బును ఏ రకంగా ఖర్చు చేశారన్న అంశంపై ఫైనాన్షియల్ మాన్యువల్ కూడా లేదన్నారు. అంతేగాక డీడీసీఏ ద్వారా మూడు కంపెనీలకు రూ.కోటి 55 లక్షల లోన్ మంజూరు చేశారని, ఎందుకు లోన్ ఇచ్చారన్న కారణం మాత్రం చెప్పలేదని వివరించారు. 1999 నుంచి 2013 వరకు నకిలీ కంపెనీలకు జైట్లీ నిధులను విడుదల చేశారని కుమార్ విశ్వాస్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News