: ముంబై పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించిన రిక్షావాలా!
అతను ఓ రిక్షా డ్రైవర్. గోవండీ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తన మిత్రుడికి ఫోన్ చేసి లోకమాన్య తిలక్ టెర్మినల్ లో ఏకే-47 తుపాకులు పట్టుకున్న నలుగురిని చూశానని చెప్పాడు. అంతే, ఆ కానిస్టేబుల్ తన పై అధికారులకు, ఆపై ఉన్నతాధికారులు రైల్వే పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ రైల్వే స్టేషన్ ను చుట్టుముట్టాయి. ప్రతి ఒక్కరినీ ప్రశ్నించారు. అన్ని సీసీటీవీ ఫుటేజ్ లూ చూశారు. ఎక్కడా అనుమానితుల జాడ లేదు. ఆరు గంటల తీవ్ర ఉత్కంఠ, ఉరుకులు, పరుగుల అనంతరం, ప్రమాదం లేదని, సెర్చ్ ఆపరేషన్ ముగిస్తున్నామని ప్రకటించి, ఆపై ఆ రిక్షావాలాను ఇంటరాగేట్ చేశారు. తాను మిత్రుడితో కలసి ఓ కార్యక్రమానికి వెళ్లాల్సి వుందని, సమయం దాటుతుండటంతో, ఇలా ఫోన్ చేస్తే, రైల్వే స్టేషన్ వద్దకు వెంటనే వస్తాడని భావించి ఫోన్ చేసినట్టు చెప్పాడు. దీంతో పోలీసులు రిక్షావాలాకు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.