: తమిళనాడు వరద బాధితులకు ఉచిత మిక్సీ, గ్రైండర్లు
తమిళనాడు వరద బాధితులకు అవసరమైన గృహోపకరణ వస్తువులు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 1.85 కోట్ల రేషన్ కార్డుదారులకు ఉచిత మిక్సీ, గ్రైండర్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. నవంబర్ వరకు 1.40 కోట్ల కార్డు దారులకు ఉచిత వస్తువులు ఇచ్చారు. అదే సమయంలో కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నై, కాంచీపురం, కడలూర్, తిరువళ్లూర్ జిల్లాలో పలు ఇళ్లు నీట మునగడంతో టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, మిక్సీ, గ్రైండర్ వంటి పలు వస్తువులు పాడైపోయాయి. దాంతో ప్రభుత్వం నగదు సాయం అందజేస్తుంటే తమకు మరింత ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో పాడైన వస్తువులను తీసుకుని వాటికి బదులు కొత్తవాటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.