: బీసీ ఎమ్మెల్యే దాడిశెట్టిని సస్పెండ్ చేయడం దారుణం: ఎమ్మెల్యే చెవిరెడ్డి


ఏపీ శాసనభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాడిశెట్టి రామలింగేశ్వరరావు అలియాస్ రాజా, శివప్రసాద్ రెడ్డిలను సస్పెండ్ చేయడాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రశ్నించారు. సభ వాయిదా అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, బీసీ ఎమ్మెల్యే అయిన దాడిశెట్టిని సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ఆయన ఎవరికి వ్యతిరేకంగా ఏం తప్పు మాట్లాడారని చర్య తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. దాడిశెట్టి కనీసం నోరు కూడా తెరవలేదని, స్పీకర్ పోడియం వద్ద నిరసన మాత్రమే తెలియజేశాడన్నారు. కానీ ముఖ్యమంత్రి ఒక బీసీని సస్పెండ్ చేశారంటే బీసీల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. బీసీలను అసెంబ్లీలోనూ, బయట ఈ ప్రభుత్వం అణగదొక్కుతుందని, కచ్చితంగా ఈ ప్రభుత్వం బీసీ వ్యతిరేకని ధ్వజమెత్తారు. తమ పార్టీ బీసీలకు అండగా ఉంటుందన్నారు.

  • Loading...

More Telugu News