: టీఆర్ఎస్ లో కాంగ్రెస్ నేత గడ్డం ప్రసాద్ చేరిక ఖరారు
మరో కాంగ్రెస్ నేత టీఆర్ఎస్ లోకి జంప్ అవుతున్నారు. ఈ మేరకు తాను టీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్న మాట వాస్తవమేనని గడ్డం ప్రసాద్ తెలిపారు. తనను సీఎం కేసీఆర్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని చెప్పారు. హైదరాబాద్ లో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్ తనకు మంచి మిత్రుడని తెలిపారు. కాంగ్రెస్ తనను పట్టించుకోవడం లేదని చెప్పిన గడ్డం ప్రసాద్, తనను సంప్రదించకుండానే మాజీ మంత్రి చంద్రశేఖర్ కు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని ఆరోపించారు.