: దోషులు ఎవరైనా కఠిన చర్యలు... కాల్ మనీపై రేపు ప్రకటన చేస్తా: చంద్రబాబు


ఏపీలో కలకలం రేపిన కాల్ మనీ దందాపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విస్పష్ట ప్రకటన చేశారు. నేటి ఉదయం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా కాల్ మనీపై చర్చకు వైసీపీ పట్టుబడిన నేపథ్యంలో రెండు సార్లు వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో చంద్రబాబు మాట్లాడారు. కాల్ మనీపై రేపటి సమావేశాల్లో తానే స్వయంగా ప్రకటన చేస్తానని ఆయన తెలిపారు. కాల్ మనీ వ్యవహారంలో తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. దోషులు ఏ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం తీరు నాగరిక సమాజం తలదించుకునేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాను ప్రసంగిస్తున్న సమయంలోనూ వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు.

  • Loading...

More Telugu News