: తెలంగాణలో నవజాత శిశువుల ఆరోగ్యంతో ఆటలు... యునిసెఫ్ సంచలన నివేదిక!


తెలంగాణలో ప్రభుత్వ అనుబంధ నవజాత శిశువుల కేంద్రాల్లో వివిధ రుగ్మతలకు చికిత్సల నిమిత్తం యాంటీబయాటిక్స్ లను అధిక మోతాదులో ఇస్తున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమని యునిసెఫ్ సంచలన నివేదికను విడుదల చేసింది. 98 శాతం కేసుల్లో ఇలానే జరుగుతున్నట్టు తమ అధ్యయనంలో వెల్లడైందని, వైద్యులు శిశువుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని తెలిపింది. 'యాంటీబయాటిక్స్ యూసేజ్ రేట్ ఎక్రాస్ ఎస్ఎన్సీయూస్' (స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్స్) పేరిట నివేదిక విడుదల కాగా, తెలంగాణలోని 19 ఆసుపత్రుల్లో 13 చోట్ల అధిక మోతాదులో డ్రగ్స్ రోజుల శిశువులకు ఇస్తున్నారని పేర్కొంది. జనవరి 1 నుంచి డిసెంబర్ 14 వరకూ జన్మించిన శిశువులకు యాంటీబయాటిక్స్ అధికంగా ఇచ్చారని వెల్లడించింది. రిమ్స్ ఆసుపత్రిలో 98 శాతం, వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో 92 శాతం, కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో 82 శాతం, తాండూరు ఆసుపత్రిలో 80 శాతం, సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 77 శాతం, నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో 74 శాతం, నల్గొండలో 73 శాతం, హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో 70 శాతం, సిద్దిపేట ఆసుపత్రిలో 66 శాతం, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో, ఖమ్మం ఆసుపత్రిలో 61 శాతం, వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో 60 శాతం, హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో 57 శాతం మంది శిశువులకు హైడోస్ లు ఇస్తున్నారని, దీని వల్ల వారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతోందని యునిసెఫ్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ గగన్ గుప్తా వివరించారు.

  • Loading...

More Telugu News