: చింటూ విడుదలైన వెంటనే నీ అంతు చూస్తాం: చిత్తూరు టూ టౌన్ సీఐకి బెదిరింపు లేఖ


చిత్తూరు టూ టౌన్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ సూర్యమోహన్ రావుకు బెదిరింపు లేఖ వచ్చింది. మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో కీలక నిందితుడు చింటూ పేరుతో ఈ లేఖ వచ్చింది. చింటూ విడుదలైన వెంటనే నీ అంతు చూస్తామంటూ లేఖలో ఘాటుగా హెచ్చరించారు. ఆర్థిక లావాదేవీలన్నింటినీ బయటపెడతామని లేఖలో పేర్కొన్నారు. దీనికి తోడు సీఐకి గాజులు, పసుపు కూడా పంపించారు. హత్య కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో, సీఐనే చంపేస్తామంటూ లేఖ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ లేఖను ఎవరు రాసుంటారనే కోణంలో దర్యాప్తును ప్రారంభించారు.

  • Loading...

More Telugu News