: పారిపోలేదు... జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం: శింబు
మహిళలకు వ్యతిరేకంగా పాట పాడి అన్ని వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొన్న తమిళ నటుడు శిలంబరసన్ అలియాస్ శింబు, ఈ విషయంలో స్పందించాడు. ప్రచారంలో ఉన్నట్టుగా తానెక్కడికీ పారిపోలేదని, తాను తమిళనాడును విడిచి ఎక్కడికీ వెళ్లబోనని అన్నాడు. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధమేనని అన్నాడు. తానెలాంటి తప్పూ చేయలేదని స్పష్టం చేశాడు. కాగా, ఈ కేసులో 19న హాజరు కావాలని శింబు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లకు కోవై పోలీసులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈలోగా ముందస్తు బెయిలును తెచ్చుకోవాలని శింబు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.