: చంద్రబాబు, బోడె ప్రసాద్ ల ఫొటోను ప్రదర్శించిన వైసీపీ... జగన్ ను దొంగల ముఠా నాయకుడిగా పేర్కొన్న కాల్వ
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభ ప్రారంభమైన వెంటనే కాల్ మనీ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ, తమ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో నిరసన ప్రదర్శనకు దిగింది. వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి చర్చకు అనుమతించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు సీఎం చంద్రబాబు, కాల్ మనీ నిర్వాహకులతో స్నేహం చేసిన టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కలిసి ఉన్న ఫొటోను ప్రదర్శించారు. సదరు ఫొటో ఉన్న పేపర్ ను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా చేతబట్టారు. ఇదిలా ఉంటే, విపక్షం తీరుపై ఘాటుగా స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ను ఆయన దొంగల ముఠా నేతగా అభివర్ణించారు. అంతేకాక వైఎస్ జగన్ తో కాల్ మనీ నిందితుడు కలిసి ఉన్న ఫొటోను టీడీపీ సభ్యులు ప్రదర్శించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.