: ఈ నెల 22 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు... బీఏసీ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 22 దాకా కొనసాగనున్నాయి. మరికాసేపట్లో ప్రారంభం కానున్న సమావేశాలకు సంబందించి కొద్దిసేపటి క్రితం బీఏసీ సమావేశం ముగిసింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన బీఏసీ భేటీలో సమావేశాలను ఈ నెల 22 దాకా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 21న వైకుంఠ ఏకాదశి అయినప్పటికీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు.