: బెజవాడ పోలీస్ స్టేషన్లో మహిళా వీఆర్ఏలు... రాత్రంతా జాగారం, ముగ్గురికి అనారోగ్యం
డిమాండ్ల సాధన కోసం నిన్న విజయవాడలో ఆందోళనకు దిగిన వీఆర్ఏలకు పోలీసులు షాకిచ్చారు. ఆందోళనకు దిగారన్న నెపంతో వీఆర్ఏలను అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రి దాకా అందరినీ పటమట పోలీస్ స్టేషన్లోనే ఉంచి, ఆ తర్వాత పురుష వీఆర్ఏలను విడిచిపెట్టి 22 మంది మహిళా వీఆర్ఏలను వదిలిపెట్టేందుకు ససేమిరా అన్నారు. గుర్తింపు కార్డులు లేవన్న కారణాన్ని చూపిన పోలీసులు మహిళా వీఆర్ఏలను రాత్రంతా పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురు మహిళా వీఆర్ఏలు తలనొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. అంతేకాక స్టేషన్ లోనే స్పృహ కోల్పోయారు. దీంతో మరోమారు ఆందోళనకు దిగిన పురుష వీఆర్ఏలు మహిళలను విడిచిపెట్టాలని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.