: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... ఎన్టీఆర్ కు నివాళులర్పించి అసెంబ్లీకి రానున్న చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో పాలుపంచుకునే నిమిత్తం ఇప్పటికే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హైదరాబాదు చేరుకున్నారు. నేటి ఉదయం 8.15 గంటలకు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారకరామారావుకు ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన తర్వాత ఆయన అసెంబ్లీకి బయలుదేరనున్నారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ చాంబర్ లో ఉదయం 8.45 గంటలకు జరిగే బీఏసీ సమావేశానికి ఆయన హాజరవుతారు. ఇప్పటికే సమావేశాలను మరింత కాలం పాటు పొడిగించాలని ప్రతిపక్షం వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఏసీలోనే ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదు.

  • Loading...

More Telugu News