: త్రిపుర మాజీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు నమోదు
సీపీఐ(ఎం)నేత, త్రిపుర మాజీ ఎమ్మెల్యే మనోరంజన్ ఆచార్య లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమ్రాపూర్ లోని తన కార్యాలయంలో నవంబర్ 27న ఓ బాలికపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పింది. ఈ విషయమై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శికి ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.