: ఒంటెను ముద్దుపెట్టుకున్న కోడలిపై అత్తగారి రాద్ధాంతం!


ఒంటెను ముద్దు పెట్టుకున్నందుకుగాను కోడలిని వేధింపుల పాలు చేసిన అత్తగారి కథ ఒకటి సౌదీ అరేబియాలో జరిగింది. తమ పెంపుడు ఒంటెపై ఉన్న ప్రేమతో కోడలు తరచుగా దానిని ముద్దుపెట్టుకుంటుండేది. ఒంటెను ముద్దుపెట్టుకోవడం మంచి పద్ధతి కాదని, సామాజిక కట్టుబాట్లు దాటావని, మన మతాన్ని అవమానించావంటూ కోడలిపై అత్తగారు మండిపడింది. అంతటితో ఆగక, తన కొడుక్కి ఈ విషయం చెప్పింది. ఆమెతో తెగతెంపులు చేసుకోమంటూ కొడుకుపై ఒత్తిడి తెచ్చింది. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో, కోడలు తన పుట్టింటికి వెళ్లి పోయింది. అయితే, ఈవిషయమై తీవ్రంగా ఆలోచించిన భర్త, ఈ సంఘటనలో తన భార్య తప్పు ఏమీ లేదని గ్రహించాడు. అత్తగారింటికి వెళ్లి తన భార్యను వెంటపెట్టుకుని తిరిగి వచ్చాడు. అయితే, అత్త, కోడలు కలిసి మాత్రం ఉండట్లేదు. వేర్వేరుగా ఉంటున్నారు. ఒక గదిలో తల్లి ఉంటుండగా, మరో గదిలో భార్యాభర్తలు ఉంటున్నారు. ఈ విషయమై కోడలు ఏమంటోందంటే... తాను ఒంటెను ముద్దు పెట్టుకున్నానన్నది అసలు సమస్య కాదని, తనకు ఇప్పటివరకు పిల్లలు పుట్టలేదని, అదే అత్తగారి సమస్య అని చెప్పింది.

  • Loading...

More Telugu News