: ధోనీకి బౌలింగ్ చేయడం సవాలే: జడేజా
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అత్యంత ఇష్టమైన ఆటగాడు రవీంద్ర జడేజా అని, అందుకే అతను ఎంత విఫలమైనా జట్టులో అతనికి స్థానం కల్పిస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు వీరిద్దరూ ప్రాతినిధ్యం వహించారు. ఆ జట్టు యాజమాన్యం ఫిక్సింగ్ కు పాల్పడిందన్న ఆరోపణలతో దానిని నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ లో అరంగేట్రం చేయనున్న పూణే, రాజ్ కోట్ జట్లు వీరిని కొనుగోలు చేశాయి. దీంతో రాజ్ కోట్ కు ప్రాతినిధ్యం వహించనున్న జడేజా మాట్లాడుతూ, పరిమిత ఓవర్ల క్రికెట్ లో ధోనీకి బౌలింగ్ చేయడం సవాలని అన్నాడు. మ్యాచ్ ఫినిషర్ గా పేరున్న ధోనీకి బౌలింగ్ చేయడం వినూత్నమైన అనుభూతి అని జడేజా చెప్పాడు.