: నేపాల్ అధ్యక్షురాలి కాన్వాయ్ పై రాళ్ల దాడి
నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ కాన్వాయ్ పై రాళ్లదాడి జరిగింది. నేపాల్ నూతన రాజ్యాంగాన్ని నిరసిస్తూ మాదేశ్ కార్యకర్తలు అధ్యక్షురాలి కాన్వాయ్ పై రాళ్లదాడికి దిగారు. విద్యాదేవి భండారీ జనక్ పూర్ లోని ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్తుండగా మాదేశ్ మోర్చా కార్యకర్తలు ఆమె కాన్వాయ్ ను అడ్డుకున్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. కొందరు కార్యకర్తలు కాన్వాయ్ పై రాళ్లదాడి చేశారు. అనంతరం జనక్ పూర్ ఆలయానికి చేరుకున్న ఆమె కాన్వాయ్ పై పెట్రోల్ బాంబు దాడి చేశారు. దీంతో ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించిన పోలీసులు, ఆందోళన కారులపై బాష్పవాయుగోళాలు ప్రయోగించారు.