: ఏపీలో వీఆర్ఏల ఆందోళన...సెల్ టవర్ ఎక్కిన 9 మంది వీఆర్ఏలు
కృష్ణా జిల్లా విజయవాడలోని రామవరప్పాడు రింగు రోడ్డు దగ్గర ఏపీ వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. కేబినెట్ భేటీలో తమ సమస్యలు పరిష్కరించలేదని పేర్కొంటూ 9 మంది వీఆర్ఏలు సెల్ టవర్ ఎక్కారు. 45 రోజులుగా తమ సమస్యలపై పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. 6,500 రూపాయల జీతం సరిపోవడం లేదంటూ తాము ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతిపత్రాలు సమర్పించామని, కానీ నేతలెవరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. రోజుకు 200 రూపాయల వేతనానికి ఎవరూ పని చేయడంలేదని, తాము మాత్రం పని చేస్తున్నామని వారు చెబుతున్నారు. రామవరప్పాడు రింగు రోడ్డు దగ్గర ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.