: తాజ్ నుంచి 7 కోట్లు వసూలు చేస్తాం: ఫడ్నవీస్


ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ నుంచి 7 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) చర్యలు చేపట్టిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీకి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, తాజ్ ప్యాలెస్ ముందు ఏర్పాటు చేసిన బారికెడ్లు ఉన్న ప్రదేశానికి అద్దె చెల్లించాలని హోటల్ యాజమాన్యానికి స్పష్టం చేశామని అన్నారు. ముంబై దాడుల అనంతరం హోటల్ రక్షణ కోసం బారికేడ్లు ఏర్పాటు చేసిందని సభకు తెలిపారు. హెరిటేజ్ కమిటీ అనుమతిచ్చిన నేపథ్యంలో దీనికి అదనపు అనుమతులు అవసరం లేదని ఆయన వెల్లడించారు. అయితే ఈ బారికేడ్లు ఏర్పాటు చేసినందుకు అద్దె చెల్లించాల్సి ఉంటుందని, అది 7 కోట్ల రూపాయలు అయిందని, దానిని వసూలు చేసేందుకు బీఎంసీ చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు. ఆ పరిసరాల్లో ఇలాంటి పలు సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని, వాటిపై కూడా పరిశీలిస్తున్నామని ఆయన శాసనసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

  • Loading...

More Telugu News