: ఎన్నికల్లో గెలిచిందని ముక్కు కోసేశారు... యూపీలో ఘాతుకం
గ్రామ ప్రధాన్ ఎన్నికల్లో విజయం సాధించిందన్న ఆగ్రహంతో ఓటమిపాలైన వర్గం ఓ మహిళ ముక్కు కోసేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. రౌడీలు రాజ్యమేలుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ లోని ఉన్నవ్ ప్రాంతానికి చెందిన నిర్మలాదేవి గ్రామ ప్రధాన్ గా పోటీ చేసి విజయం సాధించారు. దీనిని తట్టుకోలేకపోయిన ఓటమిపాలైన అభ్యర్థి అనుచరులు నిర్మలాదేవిపై దాడికి దిగి, ఆమె ముక్కు కోసేశారు. అంతటితో ఆగకుండా ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. దీనిని గమనించిన గ్రామస్థులు అడ్డుకుని, వారిని పట్టుకునే లోపు పరారయ్యారు. నిర్మలాదేవిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.