: ఇస్రో కీర్తిలో మరో ఘనత...పీఎస్ఎల్వీ సీ-29 విజయవంతం


భారత కీర్తిపతాకను ఇస్రో మరోసారి ఎగురవేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం పీఎస్ఎల్వీ సీ-29 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. సింగపూర్ కు చెందిన ఆరు ఉపగ్రహాలను శ్రీహరి కోట నుంచి మోసుకుంటూ పీఎస్ఎల్వీ సీ-29 నింగికెగసింది. ఎంతో ఉత్కంఠ రేపిన ఈ ప్రయోగాన్ని సింగపూర్ ప్రతినిధుల సాక్షిగా భారత శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. సాయంత్రం 6 గంటలకు నింగికెగసిన ఈ రాకెట్, సింగపూర్ కు చెందిన 6 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో శాస్త్రవేత్తలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. సింగపూర్ ప్రతినిధులు షార్ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.

  • Loading...

More Telugu News