: కాలుష్యం వల్ల ఏటా 21 లక్షల మంది మృతి
దేశం మొత్తం మీద వాహనాలు, కర్మాగారాల వల్ల వెలువడుతున్న కాలుష్యం వల్ల ఏటా 6,20,000 మంది చనిపోతున్నారట. అంతేకాకుండా, ఏసీ, ఫ్రిజ్, కిరోసిన్ స్టవ్ వల్ల వెలువడుతున్న ఇంటిలోపలి కాలుష్యం వల్ల ఏటా 15 లక్షల మంది దుర్మరణం పాలవుతున్నారు. ఈ వివరాలను 'బాడీ బర్డెన్-2015' నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ అనే పరిశోధన సంస్థ వెలువరించింది. మరోవైపు, కాలుష్యం బారిన పడి ఒక్క ఢిల్లీలోనే ప్రతి ఏటా 30 వేల మంది ప్రాణాలను కోల్పోతున్నారట. ఈ వాయు కాలుష్యం చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని నివేదిక తెలిపింది.