: కేజ్రీవాల్ కు 'యూటర్న్ ఆఫ్ ది ఇయర్' అవార్డు ఇవ్వవచ్చంటున్న బీజేపీ నేత


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ మండిపడ్డారు. అరుణ్ జైట్లీపై విమర్శలు చేస్తూ, కేసుకు సంబంధం లేని ఫైళ్లను సీబీఐ తీసుకెళ్లిందన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ, కేజ్రీవాల్ కు 'యూ టర్న్ ఆఫ్ ది ఇయర్' అవార్డు ఇవ్వవచ్చని అన్నారు. ఢిల్లీలో అవినీతిని అంతం చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ అవినీతిపరుడికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ఆరోపించారు. అంటే కేజ్రీవాల్ అవినీతికి మద్దతు పలుకుతున్నట్టే కదా? అని ఆయన విమర్శించారు. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న రాజేంద్ర కుమార్ గతంలో అవినీతికి పాల్పడ్డారంటూ సీబీఐ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై కేజ్రీవాల్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

  • Loading...

More Telugu News