: వారిని ఎన్ కౌంటర్ చేయాలి: వల్లభనేని వంశీ
కాల్ మనీ వ్యవహారం ఏపీని కుదిపేస్తోంది. రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానుండటంతో, ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. విపక్షాలు ఈ విషయంపై విమర్శలు ఎక్కుపెడుతుండగా, తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఈ అంశంపై స్పందించారు. కాల్ మనీ ద్వారా మహిళలను వేధించే వారిని ఎన్ కౌంటర్ చేయాలని అన్నారు. ఈ వ్యవహారంలో ఎలాంటి వారున్నా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. దీనికితోడు, నిడమానూరు మెట్రో రైల్ డిపో వల్ల చాలా మంది నిరాశ్రయులు కానున్నారని... వీరందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.