: శృంగేరి చేరుకున్న కేసీఆర్... చండీ యాగానికి భారతీ తీర్థానంద స్వామికి ఆహ్వానం
కర్ణాటకలోని శృంగేరి మఠాధిపతి భారతీ తీర్థానంద స్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ఈ నెల 23న తాను నిర్వహించ తలపెట్టిన చండీ యాగానికి రావాలంటూ ఆహ్వాన పత్రికను ఇచ్చి ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ దంపతులు తీర్థానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సమయంలో సీఎం వెంట కొందరు వేద పండితులు కూడా ఉన్నారు. అంతకుముందు శృంగేరి చేరుకున్న కేసీఆర్ కు మఠాధిపతులు ఘన స్వాగతం పలికారు. శృంగేరి మఠంలో గతంలో భారతీ తీర్థానంద స్వామి అయుత చండీ మహా యాగం నిర్వహించారు. ఈ నేపథ్యంలో యాగానికి సంబంధించి మఠాధిపతి సలహాలు, సూచనలు కేసీఆర్ స్వీకరించారు.