: కటక్ లో అల్ ఖైదా అనుమానిత వ్యక్తి అరెస్టు
ఒడిశాలో అల్ ఖైదా తీవ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదిగా అనుమానిస్తున్న అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసుల బృందం అరెస్టు చేసింది. కటక్ జిల్లాలోని పశ్చిమకచ్చా గ్రామానికి చెందిన రెహమాన్ (37) పై పోలీసులు కొద్ది రోజులుగా నిఘా ఉంచారు. నిన్న(మంగళవారం) రాత్రి అతను చేసిన ఫోన్ కాల్స్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. ఇవాళ స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి తదుపరి విచారణ కోసం ఢిల్లీకి తీసుకువెళ్లనున్నామని పేర్కొన్నారు.