: కాల్ మనీ వ్యవహారంపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ: యనమల
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపుతున్న కాల్ మనీ వ్యవహారంపై జ్యుడీషియల్ కమిషన్ వేసి, హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ తో ఈ కేసు విచారణ జరిపించాలని కేబినెట్ నిర్ణయించిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. విజయవాడలో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు, మనీ ల్యాండరింగ్ బిల్లు సహా ఆరు ప్రధాన బిల్లులు ప్రవేశపెట్టనున్నామని అన్నారు. అలాగే అంగన్ వాడీల జీతాలు పెంచడంపై కూడా నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఆరు రోజుల పాటు జరగనున్న శాసనసభ సమావేశాలలో ఎలాంటి కాలయాపన లేకుండా సమగ్ర చర్చ జరపాలని అధికార పక్షం భావిస్తోందని ఆయన చెప్పారు.