: మావో లేఖకు వేలంలో ఆరున్నర కోట్లు!


అంతర్జాతీయ దౌత్యానికి సంబంధించి చైనా కమ్యూనిస్టు వ్యవస్థాపక నాయకుడు మావో జెడాంగ్ రెండు లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఒక దానికి వేలం పాట నిర్వహించారు. ఆరున్నర కోట్ల రూపాయలు చెల్లించి ఆ లేఖను చైనాకు చెందిన ఒక వ్యాపారవేత్త సొంతం చేసుకున్నట్లు సోత్ బై వేలం సంస్థ పేర్కొంది. 1937లో బ్రిటన్ లేబర్ పార్టీ నాయకుడు క్లెమెంట్ అట్లీకి మావో ఈ లేఖ రాశారు. చైనాపై దురాక్రమణకు వచ్చిన జపాన్ సైన్యాన్ని తరిమి కొట్టేందుకు అవసరమైన సహాయం అందించేందుకు గాను, బ్రిటన్ సైన్యాన్ని ఒప్పించాలని క్లెమెంట్ ను కోరుతూ మావో ఈ లేఖ రాశారు. ఈ సందర్భంగా వేలం పాట నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ లేఖకు కోటిన్నర రూపాయలు వస్తాయని తాము ఊహించామని, కానీ, సుమారు ఐదు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కాగా, ఈ లేఖను కొనుగోలు చేసిన చైనా వ్యాపారవేత్త పేరును మాత్రం వారు బయటపెట్టలేదు.

  • Loading...

More Telugu News