: సీఎం అంటే కాల్ మనీ: రోజా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. సీఎం అంటే కాల్ మనీలా పరిస్థితి తయారయిందని మండిపడ్డారు. ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తున్న కాల్ మనీపై అసెంబ్లీలో చంద్రబాబు సమాధానం చెప్పేంత వరకు వదిలిపెట్టమని ఆమె చెప్పారు. 25 నుంచి 30 రోజుల పాటు జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను కేవలం ఆరు రోజులకే పరిమితం చేయడం దారుణమని అన్నారు. చంద్రబాబు నీతులు చెబుతారే కాని... స్వతహాగా ఆయన ఏదీ పాటించరని విమర్శించారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఈ రోజు వైకాపా శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో రోజా మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.