: బెడిసికొట్టిన రష్యా క్షిపణి ప్రయోగం!


రష్యా చేపట్టిన ఓ క్షిపణి పరీక్ష బెడిసికొట్టింది. సైనికులకు శిక్షణ ఇస్తూ, ఓ క్రూయిజ్ మిసైల్ ను ప్రయోగించగా, అది అదుపుతప్పి జనావాసాలపై పడింది. మాస్కోకు దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలోని న్యోనోస్కా పట్టణంలోని రెండంతస్తుల భవంతిపై పడి క్షిపణి పేలడంతో ఆ భవనం ధ్వంసమైనట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు లేచాయని, ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని వివరించారు. ప్రయాణించాల్సిన మార్గాన్ని వీడి క్షిపణి దూసుకెళ్లగా, దీన్ని నిలువరించలేక పోయినట్టు సమాచారం. క్షిపణి ప్రయోగం విఫలం కావడంపై విచారణకు ఆదేశించినట్టు అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News