: కొత్త లుక్కులో వెంకయ్యనాయుడు... బ్యాటు చేతబట్టి బ్యాడ్మింటన్ ఆడిన కేంద్ర మంత్రి
నల్లటి ట్రాక్ సూట్, నెత్తిన నల్లని టోపీ, కాళ్లకు తెల్లటి స్పోర్ట్స్ షూస్... ఇలా క్రీడాకారుడి గెటప్పులో ఈ ఉదయం బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ కు వచ్చారు. మరో కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీతో కలిసి వచ్చిన వెంకయ్య అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. అనంతరం అక్కడి క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడారు. నిత్యం తెల్లటి పంచె, తెల్ల చొక్కాలో నిండైన తెలుగుదనంతో ఉట్టిపడేలా కనిపించే వెంకయ్య, పూర్తిగా నల్లటి ట్రాక్ సూటు, టోపీతో వచ్చి కొత్త లుక్కులో కనువిందు చేశారు.