: వేద పండితులతో కలసి శృంగేరికి బయల్దేరిన కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీ సమేతంగా శృంగేరికి బయల్దేరి వెళ్లారు. అయుత చండీయాగానికి రావాలంటూ శృంగేరి మఠాధిపతి భారతీ తీర్థస్వామిని ఆయన ఆహ్వానించనున్నారు. ప్రత్యేక విమానంలో మంగళూరుకు బయల్దేరిన ఆయన... అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా శృంగేరికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా కొందరు వేద పండితులను కూడా తన వెంట తీసుకెళ్లారు కేసీఆర్. యాగ నిర్వహణకు సంబంధించి మఠాధిపతి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడానికి వేద పండితులను వెంటబెట్టుకెళ్లారు. ఈ క్రమంలో, ఇప్పటిదాకా జరిగిన ఏర్పాట్లను భారతీ తీర్థస్వామికి కేసీఆర్ వివరించనున్నారు.

  • Loading...

More Telugu News