: ఉగ్రవాదుల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు రద్దు చేయాలి: డొనాల్డ్ ట్రంప్
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రాబల్యం ఉండే ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను రద్దు చేయాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున రేసులో దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సోషల్ మీడియా ద్వారానే యువతను ఉగ్రవాదం వైపు ఐఎస్ ఆకర్షిస్తోందని చెప్పారు. ఇంటర్నెట్ ద్వారానే అనేక మందిని ఇస్లామిక్ స్టేట్ తన దగ్గరకు రప్పించుకుందని తెలిపారు. సామాన్యుల కంటే ఐఎస్ ఉగ్రవాదులే ఇంటర్నెట్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారని చెప్పారు. సిలికాన్ వ్యాలీ మేధావులు ఐఎస్ గ్రూపు ఎప్పుడు ఎక్కడుంది, ఎలాంటి చర్యలకు పాల్పడబోతోంది? అనే విషయాలను గుర్తించగలగాలని సూచించారు.