: నేడు సింగపూర్ ఉపగ్రహాలను నింగిలో ప్రవేశపెట్టనున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ రోజు మరో భారీ ప్రయోగాన్ని చేపట్టనుంది. పీఎస్ఎల్వీ సీ-29 ద్వారా సింగపూర్ కు చెందిన ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. షార్ నుంచి ఇది 50వ ప్రయోగం కావడం గమనార్హం. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) శ్రేణిలో ఇది 32వ ప్రయోగం. ఈ నాటి ప్రయోగం ద్వారా 625 కిలోల బరువు గల ఆరు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-29 తనతో పాటు తీసుకెళుతోంది. ఇందులో 400 కిలోల టెలియోస్ ఉపగ్రహం ప్రధానమైనది. భూ పరిశీలన కోసం సింగపూర్ అంతరిక్ష సంస్థ మొట్టమొదటి సారిగా టెలియోస్ ఉపగ్రహాన్ని పంపుతోంది. దీంతో పాటు మరో ఐదు చిన్న ఉపగ్రహాలను నింగిలో ప్రవేశపెడుతోంది. సాయంత్రం 6 గంటలకు పీఎస్ఎల్వీ సీ-29 నింగిలోకి దూసుకెళ్లనుంది. సోమవారం ఉదయం నుంచి కౌంట్ డౌన్ నిరంతరాయంగా కొనసాగుతోంది.