: చేతులు మాత్రమే కాలాయి... నా ముఖం బాగానే ఉంది: అలియా భట్ ట్వీట్
గత వారాంతంలో బిగ్ స్క్రీన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం సందర్భంగా బాణసంచా కాలుస్తుండగా, బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ కు గాయాలు కాగా, కోలుకున్న అనంతరం, తాను క్షేమమేనంటూ ట్వీట్ చేసింది. ఈ ప్రమాదంలో ఆమె మోచేతులకు కాలిన గాయాలు అయ్యాయి. కాలిపైనా, మెడపైనా నిప్పురవ్వలు పడ్డాయి. తన వైపు దూసుకొస్తున్న ఓ రాకెట్ ను చూసిన ఆమె తన ముఖానికి చేతులను అడ్డుపెట్టుకోగా, అది ఆమె సమీపానికి వచ్చి పేలినట్టు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఓ కథనాన్ని ప్రచురించింది. ఆసుపత్రి నుంచి ఆమె ఇంటికి వెళుతున్న సమయంలో తీసిన చిత్రాలను చూస్తుంటే, చేతికి గాయాలు అయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కాగా, తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని, తన ముఖం బాగానే ఉందని, ఈ తరహా ఘటనలను ముందస్తు జాగ్రత్తలతో నివారించవచ్చని అలియా ట్వీట్ చేసింది.