: కాల్ మనీ వ్యవహారంపై విజయవాడలో జనసేన కార్యకర్తల ధర్నా


విజయవాడలో కొన్ని రోజుల నుంచి కలకలం రేపుతున్న కాల్ మనీ వ్యవహారంపై తాజాగా జనసేన పార్టీ ధర్నా చేపట్టింది. నగరంలోని కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఆ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాల్ మనీ వ్యవహారంలో మహిళలను వేధిస్తున్న వ్యాపారులను ఉరితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాల్ మనీ రాబందులను ఎన్ కౌంటర్ చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News