: తిరుమలలో ధార్మిక సదస్సు నిర్వహణ కంటితుడుపు చర్యే: స్వరూపానందేంద్ర సరస్వతి


తిరుమలలో ఈ నెల 2న నిర్వహించిన ధార్మిక సదస్సుపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సదస్సు నిర్వహణ కేవలం కంటితుడుపు చర్యేనని అన్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ నుంచి గాని, హిందూ ధార్మిక ట్రస్ట్ నుంచి గానీ తనకు ఆహ్వానం అందలేదని చెప్పారు. అందుకే తాను ఆ సదస్సుకు రాలేదని స్పష్టం చేశారు. పీఠాధిపతులు, మఠాధిపతుల సలహాలు పాటించకుండా ఇలాంటి ధార్మిక సదస్సు నిర్వహించడం వ్యర్థమని స్వరూపానంద స్పష్టం చేశారు. ఇవాళ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. అయితే 18 గిరిజన ప్రాంతాలలో మతమార్పిడులు అడ్డుకునేందుకు ఆలయాలు నిర్మించాలని టీటీడీని కోరితే స్పందించలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News