: ఢిల్లీలో కమర్షియల్ డీజిల్ వాహనాలపై సుప్రీం నిషేధం


దేశ రాజధాని ఢిల్లీలో నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నాలుగు నెలల పాటు ఢిల్లీ పరిధిలో వాణిజ్యపరమైన డీజిల్ వాహనాలను నిషేధిస్తున్నట్టు కొద్ది సేపటి క్రితం తీర్పిచ్చింది. ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణం తమ ఆదేశాలు అమలవుతాయని పేర్కొంది. 2000 సీసీకన్నా అధిక ఇంజన్ సామర్థ్యమున్న వాహనాలకు ఆదేశాలు అమలవుతాయని పేర్కొంది. ఇకపై డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ ను కూడా నిలిపివేయాలని ఆదేశించింది. కాగా, ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పటికే పలు చర్యలను కేజ్రీవాల్ సర్కారు తీసుకున్న సంగతి తెలిసిందే. వాటిల్లో భాగంగా, వచ్చే నెల 1 నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్యలోని సరి, బేసి సంఖ్యల ఆధారంగా రోజు విడిచి రోజు వాహనాలు రోడ్లపైకి రావాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News