: ప్రధాని పదవికి నేనే అర్హుడిని... ములాయం మద్దతు కూడా నాకే: ఆజం ఖాన్


వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుగాంచిన ఎస్పీ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవికి తానే అర్హుడినని చెప్పారు. అంతేకాదు, తమ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా తనకే మద్దతు ప్రకటిస్తారని కూడా తెలిపారు. తనను ప్రధానిని చేస్తే దేశానికి మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుందని, ప్రతి రోజూ దేశం పురోగతి సాధిస్తుందని చెప్పారు. నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని, ఎంపీలంతా తనను ప్రధానిగా ఎన్నుకోవాలని అన్నారు. మరోవిషయం ఏమిటంటే, ములాయంను ప్రధానిగా, రాహుల్ ను ఉప ప్రధానిగా ప్రకటిస్తే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తామని ఇటీవల యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ అన్నారు. అయినప్పటికీ, ఇవేమీ పట్టకుండా ఆజం ఖాన్ తనకు ఇష్టం వచ్చిన రీతిలో వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది.

  • Loading...

More Telugu News