: కింకర్తవ్యం... మంత్రులతో బాబు సమాలోచనలు!


కాల్ మనీ వ్యవహారంలో పాత్ర ఉన్న తెలుగుదేశం నేతల సంఖ్య అధికంగా ఉండటంతో, త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకోవాల్సిన వ్యూహాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, సహచర మంత్రులతో సమాలోచనలను జరపనున్నారు. మరికాసేపట్లో ఏపీ క్యాబినెట్ భేటీ కానుండగా, అసెంబ్లీలో విపక్షాలను ఎలా అడ్డుకోవాలన్న విషయంపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. రుణమాఫీ, బాక్సైట్ గనులపై జీవో, చిత్తూరు మేయర్ దంపతుల హత్య, తాజాగా కాల్ మనీ వ్యవహారం తదితరాలపై విపక్ష వైకాపా చేసే ఆరోపణలను గట్టిగానే ఎదుర్కోవాలని, అసెంబ్లీ సాక్షిగానే వారికి సమాధానం చెప్పాలన్నది చంద్రబాబు అభిమతంగా తెలుస్తోంది. ఇక ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఎలాగూ విపక్షాల చేతిలో అస్త్రమే. కాల్ మనీ కేసులో విజయవాడ సీపీ సెలవుపై వెళ్లడాన్ని కూడా వైకాపా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అసెంబ్లీ కేవలం ఐదు రోజుల పాటు మాత్రమే సాగనుండటంతో, ఐదు రోజుల్లో సాధ్యమైనన్ని ఎక్కువ బిల్లులను ఆమోదించుకోవాలన్నది ప్రభుత్వ అభిమతం. ఈ దిశగా మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరించాల్సిన తీరుపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News