: అంతర్రాష్ట్ర బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో సత్తా చాటిన తెలంగాణ క్రీడాకారులు
అంతర్రాష్ట్ర బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ ఛాంపియన్ షిప్ లో 15 పతకాలు సాధించారు. ఇందులో మూడు స్వర్ణ పతకాలు, ఆరు రజతాలు, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి. వినోద్, అగస్టీన్, సారాకురేషి స్వర్ణ పతకాలు సాధిస్తే, నరేందర్, ప్రసాద్ రాజ్, కుమార్, వరుణ్ స్వాతి శర్మ, రుచి రజత పతకాలు గెలుచుకున్నారు. ఇక మౌనిక యాదవ్, కృష్ణ, సానియా జోసెఫ్, రాజు, మణిదీప్, నిహాంత రెడ్డి కాంస్య పతకాలు సాధించారు. వారందరినీ శాట్స్ ఎండీ దినకర్ బాబు, డిప్యూటీ డైరెక్టర్ శోభ, రాష్ట్ర బాక్సింగ్ సంఘం నిర్వహణ కార్యదర్శి ప్రతాపరెడ్డి అభినందించారు.