: టీటీడీ వెబ్ సైట్ లో 'వైకుంఠ' టికెట్లు, 11 గంటల నుంచి అమ్మకం
ఈనెల 21న వైకుంఠ ఏకాదశి, 22న ద్వాదశి పర్వదినాల సందర్భంగా తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లాలని ప్రణాళికలు రూపొందిస్తున్న వారి కోసం టీటీడీ 10,800 టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ టికెట్ల అమ్మకాలు నేటి ఉదయం 11 గంటల నుంచి 'టిటిడి సేవా ఆన్ లైన్' వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. వీరందరినీ వైకుంఠ ద్వాదశి నాడు దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రతి గంటకూ 1200 టికెట్లను విక్రయించనున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి నాడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని నారాయణగిరి ఉద్యానవనంలో తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు.