: మోటార్ వెహకిల్ ఇన్ స్పెక్టర్ అక్రమాస్తులు రూ.100 కోట్లు!
బాలానాయక్... విశాఖపట్నంలో మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ గా చిరుద్యోగం వెలగబెడుతున్నాడు. చేసేది డివిజన్ స్థాయి ఉద్యోగమే అయినా... జిల్లా, రాష్ట్ర స్థాయిలో పనిచేసే ఉద్యోగులు ఏ వందో, వెయ్యి మంది సంపాదనో కలిస్తే కాని ఈయన ఆస్తులకు సరిరావు. సర్కారీ ఉద్యోగి అయిన ఈయన చేతివాటం ప్రదర్శించి దాదాపు రూ.100 కోట్ల మేర అక్రమాస్తులు పోగేశాడు. మొన్న ఈయన అవినీతి అక్రమార్జనలపై ఫిర్యాదులు అందుకున్న అవినీతి నిరోధక శాఖ దాడులు చేసింది. ఈ సందర్బంగా ఏసీబీ అధికారులకు దిమ్మతిరిగేలా రూ.50 కోట్ల మేర అక్రమాస్తులు వెలుగుచూశాయి. దర్యాప్తులో భాగంగా నిన్న మరో మారు దాడులు చేసిన ఏసీబీ అధికారులు మరో రూ.30 కోట్ల మేర విలువ చేసే ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్ లో బాలానాయక్ ఆస్తుల మొత్తం విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ చెబుతోంది.