: దానం... ఓ బేవకూఫ్!: నాయిని అల్లుడి ఘాటు వ్యాఖ్య


కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ చీఫ్, మాజీ మంత్రి దానం నాగేందర్ పై టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి హైదరాబాదులోని విద్యానగర్ లో జరిగిన అడిక్ మెట్ డివిజన్ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన తన ప్రసంగంలో దానంపై ఫైరయ్యారు. తన మామ, హోం మంత్రి నాయిని పంచెలూడగొడతానంటూ దానం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆయన దానంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘దానం నాగేందర్... నీవు ఓ బేవకూఫ్. హోం మంత్రి పంచెలూడగొట్టడం కాదు, నీ పైజామా తడిచేలా చేస్తాం’’ అని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో స్థానం లేక టీఆర్ఎస్ లోకి వచ్చేందుకు దానం యత్నించారని, అయితే ఇందుకు కేసీఆర్ అంగీకరించలేదని ఆయన పేర్కొన్నారు. ఉనికిని చాటుకునేందుకే దానం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇకపై హోం మంత్రిపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని కూడా శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News