: హెరాల్డ్ కేసును మూసివేయాలన్న ఈడీ అధికారి... బదిలీ చేసిన కేంద్ర ప్రభుత్వం


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను కోర్టు మెట్లెక్కించేందుకు రంగం సిద్ధం చేసిన నేషనల్ హెరాల్డ్ కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. ఈ కేసుపై ఇప్పటికే పార్లమెంటులో భారీ రభస జరుగుతోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఈ కేసును తెరపైకి తెచ్చిందని సోనియాతో పాటు రాహుల్ కూడా బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ కేసులో కేంద్రం నిన్న మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును ఇక్కడితో మూసివేయాలని ప్రతిపాదించిన సీనియర్ ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం ఉన్నపళంగా బదిలీ చేసేసింది. ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి అయిన హిమాన్షు కుమార్ లాల్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తు బాధ్యతలను ఈడీలో ఈయనే పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీల ప్రమేయం ఏమీ లేదని చెప్పిన ఆయన కేసును మూసేయాల్సిందిగా ప్రతిపాదించారు. దీంతో కంగుతిన్న కేంద్రం ఆయనను ఈడీ నుంచి ఆధార్ కార్డుల జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏ)కు బదిలీ చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News