: రాజు గారి శునకంపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన వ్యక్తికి 37 ఏళ్ల జైలు!


థాయిలాండ్ రాజు భుమిబోల్ గారి పెంపుడు శునకంపై థనాకోర్న్ సిరిపాయిబూన్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమంలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇందుకుగాను థాయి లాండ్ మిలిటరీ కోర్టు అతనికి 37 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో అతనిపై దేశ్రదోహం, రాజును అవమానించడం వంటి కేసులు నమోదు చేశారు. గత వారంలో థనాకోర్న్ ని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఆ శునకాన్ని ఏ తీరులో విమర్శించారన్న విషయాన్ని మాత్రం సంబంధిత అధికారులు బయటపెట్టలేదు.

  • Loading...

More Telugu News