: పెట్రోలు అర్ధరూపాయి...డీజిల్ 46 పైసలు తగ్గింపు!
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ ఇంధన కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గిన నేపథ్యంలో భారత్ లో కూడా భారీ స్థాయిలో పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనావేశారు. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ పెట్రోలియం కంపెనీలు స్వల్ప తగ్గింపులు చేయడం విశేషం. లీటర్ పెట్రోల్ పై 50 పైసలు ధర తగ్గించగా, లీటర్ డీజిల్ పై 46 పైసలు ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో రెండు రూపాయలు చొప్పున ధరలు తగ్గించగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆ మొత్తానికి టాక్సులు వేశాయి. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పతనమైన ప్రస్తుత పరిస్థితుల్లో చమురు సంస్థలు లాభాలు కళ్లజూస్తున్నా స్వల్పంగా ధరలు తగ్గించడం విశేషం.